బీసీలకు అన్యాయం జరుగుతోంది: శ్రీనివాస్ గౌడ్
TG: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన గణాంకాలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలు అసలు జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 61 శాతం వరకు ఉన్న బీసీ జనాభాను తక్కువగా చూపిస్తూ వాస్తవాలను వక్రీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులాల వారీగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు.