ఎదురెదురుగా ఢీకొన్న లారీలు

ఎదురెదురుగా ఢీకొన్న లారీలు

ELR: జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయారు. స్థానికులు స్పందించి లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమచారం తెలియాల్సి వుంది.