యువకుడిని రక్షించిన పోలీసులు
ELR: ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని ఇవాళ పోలీసులు కాపాడారు. ఆదివారపుపేటకు చెందిన భరత్ ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ వైపు వెళ్తున్నాడని 112 ద్వారా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన టూ టౌన్ కానిస్టేబుల్ సతీశ్ రైల్వే ట్రాక్ వద్ద యువకుడిని రక్షించారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.