మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

TPT: వరదయ్య పాలెంలోని మెడికల్ షాపులలో బుధవారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంతి తనిఖీలు చేపట్టారు. అబార్షన్ కిట్స్ అమ్మతున్నారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు చేసినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఓ మెడికల్ షాపులో అబార్షన్ కిట్స్, డాక్టర్ అనుమతి లేకుండా మందులు అమ్ముతున్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.