నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: పెరవల్లి మండలం తీపర్రు ఫీడర్‌పై విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ ఎన్. నారాయణ అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీపర్రు, వెంకట్రాయపురం, సీతారాంపురం, కాకరపర్రు, అజ్జరం తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.