ఈ నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 31 నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో నిలిపివేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. జనవరిలో బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం హామీ ఇచ్చినా.. అమల్లోకి రాలేదు. దీని వల్ల ఆస్పత్రులపై ఆర్థికభారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించారు.