పోలీసుల ఎన్‌కౌంటర్లో నిందితుడి అరెస్టు

పోలీసుల ఎన్‌కౌంటర్లో నిందితుడి అరెస్టు

గత వారం గురుగ్రామ్‌లో బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఫరీదాబాద్‌లో ఇవాళ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా వారు పారిపోయారు. వారి వెంటపడిన అధికారులు ఓ నిందితుడి కాలిపై గన్ ఫైర్ చేశారు. దీంతో నిందితుడు ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ కిందపడడంతో అతడిని అరెస్ట్ చేశారు.