నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన
NLG: టీజీజేఈసీ పిలుపు మేరకు గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో దేవరకొండలోని అన్ని గురుకుల పాఠశాలాల్లో ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో గురుకుల యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను మాట్లాడుతూ.. తక్షణమే 2వ పీఆర్సీని అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలన్నారు.