పాలకొల్లు ఏఎస్ఎన్ఎం కళాశాలలో పుస్తకాల అమ్మకం
W.G: పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో పాత పుస్తకాలు అమ్మాలని యాజమాన్యం నిర్ణయించినట్లు ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి సోమవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 28వ తేదీ లోపు తమ కొటేషన్లను సీల్డ్ కవర్లలో కళాశాల కార్యాలయంలో అందజేయాలని కోరారు. నిర్ణీత గడువులోగా కార్యాలయ పని వేళల్లో దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.