ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పర్యటన
PLD: నరసరావుపేట పట్టణంలోని 5వ వార్డు శివ సంజీవయ్య కాలనీతో పాటు 6, 7వ వార్డులలోని SRKT కాలనీలలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బుధవారం పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.