బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
ప్రకాశం: హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్లే రైలులో ప్రయాణికులు ఓ బాలుడు తప్పిపోయి తిరుగుతున్నట్లు గుర్తించారు. ప్రయాణికులు వెంటనే మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.