'హెల్మెట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే చర్యలు'

'హెల్మెట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే చర్యలు'

కడప జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 225 మందిపై కేసులు నమోదు చేసి, రూ.38,460 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.