జిల్లాస్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీలకు ఎంపిక

KNR: తిమ్మాపూర్ ఆదర్శ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కొంటు వర్షిత అనే విద్యార్థిని జిల్లాస్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వనజ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.