కన్నతల్లిని వదిలేసిన కొడుకులు.. వీధిపాలైన వృద్ధురాలు
SRPT: మోతే మండలం నామవరం గ్రామంలో 95 ఏళ్ల వెంకమ్మను ముగ్గురు కుమారులు నిర్లక్ష్యం చేసి బయటకు పంపిన ఘటన వెలుగుచూసింది. భూమి పంచుకున్న తర్వాత ఆమెను పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఆర్డివో ఆదేశాలు ఉన్నప్పటికీ భరణం ఇవ్వలేదు. ప్రస్తుతం కుమార్తె వద్ద ఉండగా, గాయంతో సూర్యాపేటలో చికిత్స పొందుతోంది. న్యాయం చేయాలని వృద్ధురాలు విజ్ఞప్తి చేసింది.