'కుటుంబ సర్వే పూర్తి చేయాలి'
VSP: యునిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఫిబ్రవరి 28 నాటికి 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తూర్పు జోన్‌లోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రజల సహకారం లేకుండా సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదని పేర్కొంటూ, సర్వేకు పూర్తిగా సహకరించాలని ప్రజలను కోరారు.