'రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోండి'
BPT: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. 1వ తరగతికి ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 20న ప్రారంభమై రేపటితో ముగియనున్నాయి. విద్యార్థుల వయస్సు 2026 మార్చి 31 నాటికి 6 ఏళ్లు నిండి ఉండాలి. 2వ తరగతి ప్రవేశాలకు ఈనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.