ఘనంగా ఆలపాటి బర్త్‌డే వేడుకలు
GNTR: తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ బ్రదర్ సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ దైవసేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు. దైవసేవకులకు ఆలపాటి అండగా ఉంటున్నారని నేతలు కొనియాడారు.