VIDEO: మందు బాబులకు అడ్డాగా బస్ స్టాప్‌లు

కృష్ణా: గన్నవరం బస్ స్టాప్‌లు మందు బాబులకు అడ్డాగా మారాయి. గన్నవరం విమానాశ్రయ సమీపంలో వీకేర్ కాలేజీ వద్ద ఉన్న బస్ స్టాప్‌లో మందు బాబులు మద్యం సేవించి సేద తీరుతున్నారు. దీంతో విద్యార్థులు నిలుచోవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.