కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: తిరుపతి రెడ్డి

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు సోమవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.