మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో జిల్లా నేతలు
VZM: మాజీ సీఎం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో జిల్లా నాయకులు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి విస్తృత స్థాయి సమావేశానికి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర రావు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యతో పాటు మరికొందరు హాజరయ్యారు.