ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

సత్యసాయి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, పింఛన్లపై మొత్తం 336 ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు.