'అర్జీలను సత్వరమే పరిష్కరించాలి'
SKLM: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ జయ దేవి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ మేరకు పలు సమస్యలపై 123 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.