బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య

బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య

భద్రాద్రి: భద్రాచలం పట్టణానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. మృతుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.