మధ్యాహ్నం ఒంటి గంటకు 50.68 శాతం నమోదు
SRPT: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 1.00 గంట వరకు జిల్లావ్యాప్తంగా సగటున 50.68 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా తిరుమలగిరిలో 62.37 శాతం, అత్యల్పంగా సూర్యాపేటలో 45.52 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.