VIDEO: 'దేశాభివృద్ధికి బీజేపీ నిదర్శనం'
SRPT: దేశాభివృద్ధికి బీజేపీ నిదర్శనమని రాష్ట్ర నాయకుడు జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఎలాంటి అవినీతి మరకలేని పారదర్శకమైన పాలనను అందిస్తుందన్నారు.