'చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలి'
MNCL: రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో మత్స్యకారులకు చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని మత్స్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడంకి చందు డిమాండ్ చేశారు. హాజీపూర్‌లో ఆదివారం సంఘం 25వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సొసైటీకి సొంత భవనం నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.