ప్రభాస్ నా క్లాస్‌మేట్: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి TDP MLA బొజ్జల సుధీర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ తన క్లాస్‌మేట్ అని ఆయన వెల్లడించారు. 'HYD నలంద కాలేజీలో మేమిద్దరం ఇంటర్(CEC) కలిసే చదువుకున్నాం. అలా ప్రభాస్‌తో నా పరిచయం మొదలైంది. ఫ్రెండ్స్ అంతా గెస్ట్ హౌస్‌లో పార్టీ కూడా చేసుకుంటాం' అని పేర్కొన్నారు. అలాగే, UV క్రియేషన్స్ వంశీ కూడా తమ క్లాస్‌మేట్ అని తెలిపారు.