కర్ణాటకలో ప్రమాదం.. ఆలూరు వ్యక్తి మృతి

KRNL: కర్ణాటకలో ఆలూరు మండలానికి చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆలూరు మండలం కురుకుందకి చెందిన బోయ ఈశ్వర్ బళ్లారిలోని తన అన్నను కలిసి తిరిగి వస్తుండగా సోమవారం సాయంత్రం బళ్ళారి-సిందువాలం క్రాస్ దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఈశ్వర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.