YCP కోటి సంతకాల కార్యక్రమం విడ్డూరం: ఎమ్మెల్యే
ప్రకాశం: YCP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేయడం విడ్డూరంగా ఉందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ, నడికుడి రైలు మార్గం, ఓవిరోడ్డు, బైపాస్ తదితర అంశాలపై అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.