'అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వాహనం పట్టివేత'

ADB: ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు తలమడుగు ఎస్సై రాధిక తెలిపారు. సోమవారం తలమడుగు అంతర్ రాష్ట్ర చెకోపోస్ట్ వద్ద నిర్వహిస్తున్న క్రమంలో ADBలోని శ్రీ శివ సాయి ఫర్టిలైజర్ నుంచి కుచులపూర్‌కు చెందిన అజయ్, సాయిరాం పేరుతో 60 బ్యాగుల ఎరువులను మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు.