చోరీ కేసులో ఇద్దరు మైనర్లు అరెస్ట్
కర్నూలు నగరంలో మార్చి 29 అర్ధరాత్రి వెంకట సుబ్బయ్య ఇంట్లో జరిగిన 20 తులాల బంగారం, 10 తులాల వెండి చోరీ కేసులో బుధవారం ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి మునగాలపాడు వద్ద పట్టుకున్నారు. నిందితులను జువెనైల్ బోర్డు ముందు హాజరుపరిచారు.