జిల్లా ప్రజలకి పోలీస్ శాఖ హెచ్చరిక..!

జిల్లా ప్రజలకి పోలీస్ శాఖ హెచ్చరిక..!

AKP: జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరించింది. బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని తెలిపారు. అలాగే, UPI పిన్ లేదా OTPని బ్యాంక్ వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు అయితే వెంటనే 1930కి కాల్, లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.