రైతులతో ముచ్చటించిన కలెక్టర్

SKLM: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్’పథకంలో ఒక్క లబ్ధిదారుడు మినహాయింపు కాకుండా అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మందస(M) సువర్ణపురం గ్రామంలో శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.