పోలీసుల ముందే ప్రమాదకర స్టంట్స్.. తర్వాత!
సోషల్ మీడియా లైకుల కోసం ప్రాణాలకు తెగించి స్టంట్లు చేస్తున్న ఆకతాయిలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొత్వాలి సర్కిల్‌లో పోలీసు వాహనం ముందే హ్యాండిల్ వదిలేసి ప్రమాదకరంగా బైక్ నడిపిన అశు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.