పవన్, లోకేష్‌పై పేర్ని నాని విమర్శలు
AP: మంత్రులు పవన్, లోకేష్‌పై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. 'ప్రజల సొమ్మును ఖర్చు చేయకుండా పవన్, లోకేష్ హెలికాప్టర్‌లలో తిరుగుతున్నారా?. దమ్ముంటే మీ అకౌంట్ కాపీలు చూపించండి. మా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకుని రావట్లేదని అంటున్నారు. మా ప్రభుత్వంలో చంద్రబాబు రాలేదు. ఆయన కూడా ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నారా?' అని ప్రశ్నించారు.