ఘనంగా తిరుమలనాథ స్వామి రథోత్సవ వేడుకలు

VKB: పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెన్తాల్ గ్రామంలో గురువారం తిరుమలనాథ స్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పరిగి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ మారుతి కిరణ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.