27న బహిరంగ వేలం

27న బహిరంగ వేలం

JN:  పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 27 న ఉదయం 11 గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి (అభిషేకం, వాహన పూజ సామగ్రి మినహాయించి) తల నీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్ బాబు తెలిపారు.