'యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం'

'యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం'

MNCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నస్పూర్ లోని కలెక్టరేట్ ప్రాంగణంలో యోగా అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు నిత్యం యోగ సాధన చేయాలని తెలిపారు. యోగా సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ప్రశాంతత చేకూరుతుందన్నారు.