మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ఎస్సై

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ఎస్సై

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో మంగళవారం పోలీస్ సిబ్బంది వాహనాలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సోఫియా మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.