వారికి నివాళులర్పించే పుణ్యక్షణం ఈరోజు

RR: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్‌నగర్‌లో తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ, వారికి నివాళులర్పించే పుణ్యక్షణం ఈరోజు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు అందె బాబయ్య పాల్గొన్నారు.