జిల్లా వ్యాప్తంగా శక్తి టీంల అవగాహన
ATP: జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల పరిధుల్లో శక్తి టీంలు అవగాహన సదస్సులు నిర్వహించాయి. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తం చేశారు. శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి వినియోగంపై వివరించారు. బాల్యవివాహాలు, మత్తుపదార్థాల అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యపరిచారు.