ఎంపీ మాగుంటను కలిసిన ఎమ్మెల్యే, కమిషనర్

ఎంపీ మాగుంటను కలిసిన ఎమ్మెల్యే, కమిషనర్

ప్రకాశం: ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంపీ మాగుంటను ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, నగర కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావులు కలిశారు. ఈ సందర్భంగా వారు నగర అభివృద్ధిపై చర్చించుకున్నారు. శరవేగంగా చేపట్టాల్సిన పనుల గురించి కమిషనర్‌కు సూచించారు. రోడ్ల విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు పోవాలని చెప్పారు.