HYD సీపీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు

TG: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను అంతర్జాతీయ అవార్డు వరించింది. డ్రగ్స్ కట్టడిలో కీలకపాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకోనున్నారు. సీపీ ఆనంద్ నగర సీపీగా వచ్చిన తర్వాత డ్రగ్స్ కట్టడిలో కీలకంగా వ్యవహరించారు.