క్యాతనపల్లిలో బాల్క సుమన్ హౌజ్ అరెస్ట్
MNCL: ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ MLA బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాతనపల్లి నివాసంలో మందమర్రి CI రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, ఎన్ని కుట్రలు చేసినా రాబోయే కాలంలో ప్రజలు రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు.