రాష్ట్రస్థాయిలో ఉత్తమ గురువు అవార్డుకు కేటీఎస్ అధ్యాపకుడు

ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వృక్షశాస్త్ర అధ్యాపకుడు విజయ్ కుమార్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ గురువు అవార్డు గ్రహించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ శనివారం తెలిపారు. CSC ఇండియా సంస్థ రాష్ట్రంలో నలుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా... అందులో తమ అధ్యాపకుడు ఉండడం గర్వకారణం అన్నారు.