జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ప్రకాశం: ఒంగోలులో జిల్లా గ్రంథాలయంలో ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనంతో మేధో వికాసం అని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. సెల్ఫోన్ వద్దు పుస్తకంతో సహవాసం ఎంతో ఉపయుక్తం అని ఈ సందర్భంగా తెలియజేశారు.