డిసెంబర్ 21న పల్స్ పోలియో: కలెక్టర్

డిసెంబర్ 21న పల్స్ పోలియో: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో డిసెంబర్ 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సున్నా నుంచి ఐదేళ్ల లోపు ప్రతి శిశువుకూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో పల్స్ పోలియో గోడపత్రికను ఆవిష్కరించి, హై-రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.