కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

NLR: కొడవటూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో కోడి పందాలపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో 4 టీమ్‌లుగా ఏర్పడి చేసిన ఈ దాడిలో 54 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 9 కార్లు, 2 ఆటోలు, 2 బైకులు, 14 కోళ్లు, రూ. 6.24 లక్షల నగదును సీజ్ చేసినట్లు కొడవటూరు సీఐ సురేంద్రబాబు వెల్లడించారు.