'రైతన్న మీకోసం' వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతన్న మీకోసం' వారోత్సవాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఈవాళ వంగర మండలం కింజంగిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం సందేశంతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడంతో పాటు, రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు.