స్పీకర్ అయ్యనను కలిసిన రేషన్ డీలర్లు

స్పీకర్ అయ్యనను కలిసిన రేషన్ డీలర్లు

VSP: ఎండీయూ రద్దు చేసి, డీలర్లకు పాత విధానాన్ని మళ్లీ అమలు చేసినందుకు గాను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని నాతవరం మండలం రేషన్ డిపో అసోసియేషన్ సభ్యులు సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు రేషన్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి నివాసాల వద్దకే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు స్పీకర్ అయ్యన్న సూచించారు.